News November 27, 2024

నేషనల్ హైవేపై ఆందోళన విరమించిన రైతులు

image

TG: నిర్మల్(D) దిలావర్‌పూర్‌లో నేషనల్ హైవేపై స్థానిక రైతులు ఆందోళన విరమించారు. కాగా స్థానికంగా ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌పై సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లుగా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీవో రత్నకళ్యాణిని చుట్టుముట్టగా ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 25, 2025

వంటింటి చిట్కాలు

image

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.

News December 25, 2025

జామలో కాయకుళ్లు తెగులు – నివారణ

image

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

News December 25, 2025

సోషల్‌ మీడియా వాడేందుకు సైనికులకు అనుమతి?

image

భారత సైన్యం సోషల్ మీడియా నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, X వంటి యాప్‌లను వాడేందుకు సైనికులు, అధికారులకు అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే సమాచారం తెలుసుకోవడం, కంటెంట్ చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్ట్, లైక్, కామెంట్ చేయడానికి పర్మిషన్ లేదని సమాచారం. హనీ ట్రాప్స్ వంటి ముప్పు నేపథ్యంలో భద్రతా నియమాలు పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.