News January 25, 2025
రైతు భరోసా.. వాళ్లకు గుడ్న్యూస్!
TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్బుక్లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.
Similar News
News January 26, 2025
రోహిత్ రిటైరవ్వకండి.. 15 ఏళ్ల అభిమాని లేఖ
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని లేఖ రాశారు. ‘నేను క్రికెట్ చూసేందుకు మీరే కారణం. ఈ మధ్య కాలంలో మీరు విఫలమవుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి ఫామ్లోకి వస్తారని ఆశిస్తున్నా. రంజీలో మీరు కొట్టిన సిక్సర్లు అద్భుతం. మీరు ఎప్పుడూ రిటైరవ్వకండి. మైదానంలో ప్రతి ఫార్మాట్లో కెప్టెన్గా, ప్లేయర్గా అదరగొడుతారు’ అని ఇన్స్టా ఐడీతో ఫ్యాన్ రాసుకొచ్చారు. ఈ లేఖను రోహిత్ టీమ్ షేర్ చేసింది.
News January 26, 2025
అదరగొట్టిన భారత బౌలర్లు
ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.
News January 26, 2025
రాజమౌళిపై నెటిజన్లు ఫైర్.. కారణమిదే!
పద్మ అవార్డులకు ఎంపికైన వారిని అభినందిస్తూ ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి పెట్టిన పోస్టుపై పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ‘ఈసారి ఏడుగురు తెలుగు వాళ్లకు పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ‘అందరూ భారతీయులే. తెలుగు, ఇండియన్స్ అంటూ ఎందుకు మాట్లాడటం. ప్రాంతీయ భేదాలు ఎందుకు?’ అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.