News March 22, 2025
వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు: నాదెండ్ల

AP: రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ పాలనలో పంటలు అమ్ముకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తాము ఇప్పటి వరకు రూ.8వేల కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల అకౌంట్లలో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
రాష్ట్రంలో 8 మంది మృతి

TG: రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట (D) బీబీగూడెం వద్ద కారు-బస్సు ఢీకొన్నాయి. ఘటనలో కారులోని భార్యాభర్త, పాప(8), మరొకరు చనిపోయారు. మృతుల్లో రవి, రేణుక, రితికను గుర్తించారు. అలాగే, హనుమకొండ- కరీంనగర్ NHపై హసన్పర్తి పెద్దచెరువు వద్ద టూవీలర్ను టిప్పర్ ఢీకొట్టగా పవన్, మహేశ్ మృతిచెందారు. నల్గొండ (D) ఏపూరులో ఈతకు వెళ్లి నవీన్(23), రాఘవేంద్ర(20) నీటమునిగి చనిపోయారు.
News March 23, 2025
రోహిత్ డకౌట్

IPL-2025: చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబైకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఖలీల్ బౌలింగ్లో మిడ్ వికెట్ ఫీల్డర్ శివమ్ దూబేకు ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు.
News March 23, 2025
డీలిమిటేషన్పై రేపు అసెంబ్లీలో తీర్మానం

TG: నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం రేవంత్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సభ్యుల ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.