News November 12, 2024
రైతులేమైనా తీవ్రవాదులా?: కేటీఆర్

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు <<14588376>>అరెస్టు చేయడాన్ని<<>> కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.
Similar News
News April 20, 2026
డెంగీ తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్‌ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రావొచ్చు. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
News April 20, 2026
విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.
News April 20, 2026
8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.


