News March 5, 2025

BRS పొరపాటు వల్లే రైతులకు ఇబ్బందులు: మంత్రి ఉత్తమ్

image

కృష్ణా, గోదావరి జలాల్లో BRS చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ‘ఖరీఫ్‌లో ఉమ్మడి AP కంటే ఎక్కువ వరి TGలో పండింది. రబీలో 56L ఎకరాల పైగానే సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. APకి BRS ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చాం’ అని తెలిపారు.

Similar News

News January 4, 2026

ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

image

<>పుణే<<>>, బిబ్వేవాడిలోని ESIC హాస్పిటల్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/DNB/DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC,STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in/

News January 4, 2026

ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

image

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.

News January 4, 2026

BRS నేతలపై టీడీపీ MLA సోమిరెడ్డి ఆగ్రహం

image

గోదావరి జలాల్లో AP వాళ్లు ఒక్క బొట్టు వాడుకున్నా సహించేది లేదని BRS నేతలు అన్నారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. BRSకు కౌంటర్‌గా రేవంత్ కూడా వాడుకోవద్దు అంటున్నారు. ఇది సరికాదు. గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని KCR కూడా గతంలో అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సీఎంలిద్దరూ టీడీపీ వాళ్లే’ అని వ్యాఖ్యానించారు.