News October 21, 2024
రైతు నేతకు షాకిచ్చిన రైతులు!

జాతీయ రైతు నేత రాకేశ్ టికాయత్‌కు వెస్ట్రన్ UP రైతులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. లోక్‌సభ, హరియాణా ఎన్నికల్లో ఆయన BJPకి వ్యతిరేకంగా, INDIA కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వెస్ట్రన్ UP రైతుల్లో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన చెప్పిందే చేస్తారు. అలాంటిది చెరకు రైతు సహకార ఎన్నికల్లో 151కి 148 సీట్లు BJP గెలవడంతో ఆయన నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరి మీరేమంటారు?
Similar News
News March 11, 2026
VASTHU: ఇంట్లో ఫొటో ఫ్రేమ్స్ ఏ దిశలో పెట్టాలంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దంపతులు/కుటుంబ సభ్యుల ఫొటోలను నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది బంధాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ‘స్నేహితులతో దిగిన, విజయాలకు సంబంధించిన ఫొటోలు తూర్పు, ఉత్తర దిశల్లో ఉంచాలి. తద్వారా కీర్తి, పురోగతి లభిస్తాయి. సరైన దిశలో అమర్చిన ఫొటోలు ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థికంగా, ఆరోగ్యంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి’ అంటున్నారు.
News March 11, 2026
వంటగ్యాస్ కొరతతో ఎంత నష్టమో తెలుసా?

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్ రంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో కొన్ని హోటళ్లు మూతబడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతోంది. దీంతో సర్వర్లు, కుక్స్, అసిస్టెంట్లు, డెలివరీ ఏజెంట్లు.. ఇలా లక్షలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. అటు హాస్టళ్లలో ఉండేవాళ్లకూ ఇబ్బందులు తప్పవు. దీంతో త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.
News March 11, 2026
శ్రీరాముడిని ‘కోదండ రాముడు’ అని ఎందుకు పిలుస్తారు?

శ్రీరామచంద్రుని ధనుస్సు పేరు కోదండం. ఇది వెదురుతో తయారైనట్లు చెబుతారు. బరువు నూరు కిలోలని ప్రతీతి. వనవాసంలో దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం దీనిని ధరించాడని పురాణ వచనం. సముద్రుడిపై ఆగ్రహించినప్పుడు ప్రయోగించిన కోదండ బాణం అజేయమైనది. రాముడు ఈ కోదండ విల్లుతోనే రావణాసురుడిని, అతని సైన్యాన్ని అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఆయనను ‘కోదండ రాముడు’ అని కొలుస్తారు.


