News May 12, 2024

రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.

Similar News

News April 11, 2026

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.

News April 11, 2026

వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

image

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It

News April 11, 2026

చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

image

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.