News August 6, 2024

రుణాల రెన్యువల్ కోసం బ్యాంకుల వద్దే రైతుల నిద్ర!

image

TG: రుణమాఫీ జరగడంతో రెన్యువల్ కోసం రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తాకిడి పెరగడంతో HNK జిల్లా పరకాలలో బ్యాంకు అధికారులు టోకెన్ల సిస్టమ్ అమలు చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు మొన్న రాత్రి బ్యాంకు వద్దే నిద్రపోయి, నిన్న ఉదయాన్నే ముందుగా లైన్‌లో నిలబడ్డారు. ఈనెల 15 వరకే లోన్ల రెన్యువల్ వర్తిస్తుందనే అపోహతో రైతులు భారీగా వస్తున్నారని, దీనికి ఎలాంటి గడువు లేదని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News September 18, 2024

కాసేపట్లో TN డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. వార్తలపై ఆయనేమన్నారంటే

image

తనను తమిళనాడు DyCMగా నియమిస్తున్నారన్న వార్తలు అవాస్తవాలేనని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ‘మీరిది సీఎంను అడగండి. దీనిపై నిర్ణయం తీసుకొనే పూర్తి హక్కులు ఆయనకే ఉన్నాయి’ అని మీడియాకు చెప్పారు. మరికొన్ని గంటల్లో DyCMగా తనను నియమిస్తున్నారన్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. అమెరికా పర్యటనకు ముందే ఎంకే స్టాలిన్ తన కుమారుడికి ఆ పదవి అప్పగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ల వల్లే ఆలస్యమవుతోందని వినికిడి.

News September 18, 2024

కలెక్షన్లలో ‘స్త్రీ-2’ రికార్డు

image

బాలీవుడ్‌ నటీనటులు రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ ‘స్త్రీ-2’ రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా రూ.586 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేయడంతో ‘స్త్రీ-2’ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి.

News September 18, 2024

ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: CPI నారాయణ

image

AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.