News September 27, 2024

కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గిపోయింది: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు విలువ తగ్గిపోయిందని BRS MLA హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌కు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి రెండు పంటలు వచ్చేలా చేస్తే కాంగ్రెస్ మాత్రం కరెంట్ కోతలు విధిస్తోందని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ వచ్చినా రైతుబంధు, బోనస్ ఇవ్వడం లేదన్నారు.

Similar News

News October 10, 2024

ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.

News October 10, 2024

‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News October 10, 2024

రతన్ టాటా అందుకున్న పురస్కారాలు

image

రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.