News February 17, 2025
FAT TO FIT: 42 రోజుల్లో 25 కేజీలు తగ్గిన డాక్టర్

చైనాకు చెందిన వు టియాంజెన్(31) అనే డాక్టర్ ఫిట్‌నెస్ జర్నీ వైరలవుతోంది. 2023లో 97.5 కేజీల బరువున్న అతను సాధనతో 42 రోజుల్లో 25 కేజీలు తగ్గారు. అథ్లెట్ల తరహాలో బాడీని తీర్చిదిద్దుకున్నారు. IFBB వరల్డ్ ఫిట్ మోడల్ ఛాంపియన్‌షిప్ సహా పలు ఫిట్‌నెస్ పోటీల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నారు. రోజూ 2గంటల వ్యాయామం, 6 గంటల నిద్ర, మంచి ఆహారం, క్రమశిక్షణ తన వెయిట్ లాస్‌కు దోహదం చేశాయని అతను చెబుతున్నారు.
Similar News
News March 15, 2025
ALERT.. రెండు రోజులు జాగ్రత్త

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుని, కావలి, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు రాయలసీమ, కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 15, 2025
అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్(83), సింగపూర్(19) దేశాలకు చెందినవి ఉన్నాయి. మెుత్తంగా 393 విదేశీ ఉపగ్రహాలు, 3కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61దేశాలు, 5బహుళజాతి సంస్థలతో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది.
News March 15, 2025
అలాంటి పాత్రలు చేయాలనేది నా కోరిక: శివాజీ

ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి నటుల్లా మరుపురాని పాత్రలు చేయాలని ఉండేదని నటుడు శివాజీ అన్నారు. క్రూరమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనేది తన కోరిక అని చెప్పారు. కోర్టు సినిమాలో తన పాత్రకు వస్తున్న ఆదరణ ఆనందాన్ని ఇస్తోందన్నారు. షూటింగ్ సెట్‌లో నా అరుపులకు అంతా భయపడేవారని తెలిపారు. ప్రస్తుతం లయతో ఓ సినిమాతో పాటు ‘దండోరా’ అనే మరో చిత్రంలో చేస్తున్నట్లు వెల్లడించారు.