News February 9, 2025
మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41మంది మృతి

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 48మందితో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో 38మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదం అనంతరం బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా తగులబడింది. ప్రస్తుతానికి 18 పుర్రెలు సేకరించామని, మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
Similar News
News March 23, 2025
ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.
News March 23, 2025
మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
News March 23, 2025
ఆ సినిమా విషయంలో బాధతో చనిపోయేవాడినేమో: SJ సూర్య

తన కెరీర్‌ను మలుపుతిప్పిన ‘ఖుషి’ మూవీ గురించి నటుడు, దర్శకుడు SJ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తమిళంలో ఖుషీ తొలి కాపీ చూసిన ఎవరికీ ఆ మూవీ నచ్చలేదు. విడుదలయ్యాక మాత్రం పెద్ద హిట్ అయింది. ముందు ఉన్న స్పందనే రిలీజ్ తర్వాతా కొనసాగి ఉంటే బహుశా ఆ బాధతో చనిపోయి ఉండేవాడినేమో’ అని పేర్కొన్నారు. తమిళంలో సూపర్ హిట్టైన అదే ‘ఖుషీ’ని తెలుగులో పవన్ కళ్యాణ్‌తో సూర్య రీమేక్ చేశారు.