News March 13, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

image

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News April 2, 2026

చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

image

భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News April 2, 2026

భద్రాద్రిలో శిక్షణ సంతోషంగా ఉంది: ట్రైనీ కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కలెక్టర్ అంకిత్, పూర్వ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకత్వం, అన్ని శాఖల అధికారుల సహకారంతోనే విజయవంతంగా శిక్షణ పూర్తి చేయగలిగానని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నానని స్పష్టం చేశారు.