News January 25, 2025
ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు ఎంజాయ్ చేశారు: వైసీపీ

AP: బిల్డప్పులు కొట్టడం తప్ప చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదని వైసీపీ విమర్శించింది. ప్రజల సొమ్ముతో తండ్రీకొడుకులు దావోస్‌లో ఎంజాయ్ చేసి వచ్చారని దుయ్యబట్టింది. 40 ఏళ్ల అనుభవమని, ఉత్త చేతులతో వచ్చారని సెటైర్లు వేసింది. దావోస్ పర్యటన డిజాస్టర్ అయిందని, బాబు పాలనని నమ్మి ఒక్క కంపెనీ MOU చేసుకోలేదని మండిపడింది.
Similar News
News February 16, 2025
నేటి నుంచి పెద్దగట్టు జాతర

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతులు స్వామి(పెద్దగట్టు) జాతర నేటి నుంచి ఈ నెల 20 వరకూ జరగనుంది. ఈ 4రోజుల పాటు అత్యంత ఘనంగా వేడుక జరపనున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. 15లక్షలమందికి పైగా భక్తులు జాతరకు రావొచ్చని అంచనా. రాష్ట్రంలో అతి పెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో పెద్దగట్టు జాతర జరుగుతుంటుంది.
News February 16, 2025
మజ్లిస్ మా ప్రధాన శత్రువు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీ తమ ప్రధాన శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మజ్లిస్ పార్టీ చాప కింద నీరులా బలాన్ని పెంచుకుంటోంది. బీజేపీ శ్రేణులు జాగ్రత్త పడాలి. ఆ పార్టీ కోరల్ని పీకాలి. సీఎం రేవంత్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు సచివాలయం కూడా దాటట్లేదు’ అని విమర్శించారు.
News February 16, 2025
చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.