News October 22, 2024
తండ్రైన భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి, అప్పుడే పుట్టిన శిశువుతో సర్ఫరాజ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. 26 ఏళ్ల సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రొమానా జహూర్‌ను J&Kలో వివాహమాడారు. ఇటీవల NZపై ఈ యువ సంచలనం అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
Similar News
News November 12, 2024
తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది: KTR
TG: మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు. రేవంత్ తన బావమరిదికి అమృతం ఇచ్చి, కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని మండిపడ్డారు. అమృత్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు.
News November 12, 2024
గోవాలో మినీ ‘సిలికాన్ వ్యాలీ’: పీయూష్
గోవాను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపించే గోవా చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఉన్న 23 పారిశ్రామిక ప్రాంతాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి’ అని గుర్తుచేశారు. సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్ పరిశ్రమలకు గోవాను కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.
News November 12, 2024
మా అబ్బాయి రికార్డుల కోసం చూడడు: శాంసన్ తండ్రి
తన కుమారుడు జట్టు కోసమే తప్ప వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించడని భారత క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘సంజూ వరస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లూ తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడతారు. సంజూ ఎప్పుడూ అలా ఆడడు’ అని స్పష్టం చేశారు.