News February 22, 2025
తండ్రీకొడుకుల సాహసం.. బైక్పై కుంభమేళా యాత్ర

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఎలాగైనా వెళ్లాలనే తపన ఆ తండ్రీకొడుకులను 3900 KM బైక్పై వెళ్లేలా చేసింది. కర్ణాటక ఉడిపిలోని శిర్వకు చెందిన ప్రజ్వల్ తన తండ్రి రాజేంద్ర(52) కోరికను తీర్చేందుకు బైక్పై రోజుకు 500KM చొప్పున 4 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్కు తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం తర్వాత FEB 10న బయల్దేరి 13న శిర్వకు వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ రూ.20000తో టూర్ ముగించారు.
Similar News
News February 22, 2025
అంజనీకుమార్, అభిలాషలను రిలీవ్ చేసిన TG సర్కార్

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో IPS అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిపై సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ ఆదేశాలను బట్టి రిలీవ్ అంశం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
News February 22, 2025
60 కోట్ల మంది స్నానమాచరించినా శుద్ధిగానే గంగానది: సైంటిస్ట్

‘మహాకుంభమేళా’లో దాదాపు 60 కోట్ల మంది స్నానమాచరించినా గంగానదిలోని నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త డా. అజయ్ సోంకర్ గంగా జలంపై అధ్యయనం చేశారు. ‘గంగా నదిలో 1100 రకాల బాక్టీరియోఫేజ్లు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయి. కాలుష్యాన్ని తొలగించడంతో పాటు చెడు బాక్టీరియా, సూక్ష్మక్రిములను నాశనం చేసి శుద్ధి చేస్తాయి’ అని సోంకర్ తెలిపారు.
News February 22, 2025
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం

AP: ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ MLAగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.