News February 22, 2025

తండ్రీకొడుకుల సాహసం.. బైక్‌పై కుంభమేళా యాత్ర

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఎలాగైనా వెళ్లాలనే తపన ఆ తండ్రీకొడుకులను 3900 KM బైక్‌పై వెళ్లేలా చేసింది. కర్ణాటక ఉడిపిలోని శిర్వకు చెందిన ప్రజ్వల్ తన తండ్రి రాజేంద్ర(52) కోరికను తీర్చేందుకు బైక్‌పై రోజుకు 500KM చొప్పున 4 రోజులు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం తర్వాత FEB 10న బయల్దేరి 13న శిర్వకు వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ రూ.20000తో టూర్ ముగించారు.

Similar News

News March 21, 2025

వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

image

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్‌లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2025

తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

image

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.

News March 21, 2025

VIRAL: ప్లీజ్.. ఇది OYO కాదు.. క్యాబ్!!

image

బెంగళూరులో ఓ డ్రైవర్ తన క్యాబ్‌లో పెట్టిన పోస్టర్ వైరల్ అవుతోంది. ‘హెచ్చరిక.. రొమాన్స్‌కు అనుమతి లేదు. ఇది క్యాబ్, ఓయో కాదు..’ అని అతడు రాసుకొచ్చాడు. దీంతో తన క్యాబ్‌లో ఎన్నిసార్లు జంటల పనులతో విసిగి ఇలా చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!