News March 31, 2025
‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.
Similar News
News February 5, 2026
పాలకు మంచి ధర ఎలా వస్తుంది?

సాధారణంగా పాలలో కొవ్వు, SNF(Solids Not Fat) ఆధారంగా ధరను నిర్ణయిస్తారు. ఇవి రెండూ ఎంత ఎక్కువగా ఉంటే పాలకు అంత ఎక్కువ ధర వస్తుంది. మనం ఎంచుకున్న పశువు బ్రీడ్ బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పాల దిగుబడినిచ్చే హోలిస్టిన్ ఫ్రీజియన్ పాలలో కొవ్వు 3.5%-3.7% మధ్యలో ఉంటుంది. అందుకే ఈ పాలకు ధర తక్కువ వస్తుంది. అదే జెర్సీ ఆవులు తక్కువ పాలిచ్చినా, ఫ్యాట్ 4-4.5గా ఉండటం వల్ల ఈ పాలకు మంచి ధర వస్తుంది.
News February 5, 2026
350 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల వారు ఫిబ్రవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in
News February 5, 2026
AP EAPCET రిజిస్ట్రేషన్లు షురూ

జేఎన్టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం ఉంటుంది. మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహిస్తారు.


