News December 28, 2024

నితీశ్ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్న తండ్రి❤️

image

ఆస్ట్రేలియాపై నితీశ్ సెంచరీ శ్రమ వెనుక ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కష్టం ఎంతో ఉంది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ జింక్ లో ఆయన ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే ఉదయ్‌పూర్‌కు బదిలీ కాగా నితీశ్ క్రికెటర్ కావాలన్న కల నెరవేరదనే ఆలోచనతో మరో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను నితీశ్ కోచింగ్ కు వెచ్చించారు. ఈక్రమంలోనే ఎన్నో ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.

Similar News

News January 1, 2025

ట్రావిస్ హెడ్ మొత్తం భారతీయుల్ని అవమానించాడు: సిద్ధూ

image

పంత్ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్‌తో హెడ్ భారతీయులందర్నీ అవమానించారని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు, చిన్నారులు మ్యాచ్ చూస్తుంటారన్న సోయి లేకుండా హెడ్ అసహ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాగా.. వేలికి గాయం కావడంతో ఐస్‌క్యూబ్స్‌లో హెడ్ వేలు పెట్టారని, దాన్ని సెలబ్రేషన్స్ అప్పుడు చూపించారని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వివరణ ఇచ్చారు.

News January 1, 2025

గ్రాఫిక్ డిజైనర్.. బతుకుతెరువుకు ఇప్పుడు ఆటోడ్రైవర్!

image

ముంబైకి చెందిన కమలేశ్ కాంతేకర్‌కు గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్‌లో 14 ఏళ్ల అనుభవం ఉంది. అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ స్థాయికి వెళ్లిన అతడికి ఆ తర్వాత ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ప్రయత్నాలు చేసీ చేసీ విసిగిపోయి చివరికి ఓ ఆటోను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గరో పనిచేయడం కంటే ఇలా కష్టపడితే ఆత్మగౌరవంతో డబ్బు రెండూ ఉంటాయని, తనను అందరూ దీవించాలని కోరుతూ లింకిడ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టగా అది వైరల్ అవుతోంది.

News January 1, 2025

‘పుష్ప-2’కు ఆమిర్ ఖాన్ సంస్థ విషెస్.. స్పందించిన అల్లు అర్జున్

image

పుష్ప-2 సాధించిన ఘన విజయానికి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తరఫున ఆయన నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్(AKP) విషెస్ తెలిపింది. మైత్రీ మూవీస్, సుకుమార్, బన్నీ, రష్మికను ట్యాగ్ చేసింది. వారందరూ మరిన్ని అద్భుతమైన విజయాల్ని అందుకోవాలని పేర్కొంది. ఆ అభినందనలకు అల్లు అర్జున్ స్పందించారు. AKP టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. పుష్ప-2 వేగంగా రూ.2వేల కోట్ల మార్కును సమీపిస్తున్న సంగతి తెలిసిందే.