News January 1, 2025

గ్రాఫిక్ డిజైనర్.. బతుకుతెరువుకు ఇప్పుడు ఆటోడ్రైవర్!

image

ముంబైకి చెందిన కమలేశ్ కాంతేకర్‌కు గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్‌లో 14 ఏళ్ల అనుభవం ఉంది. అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ స్థాయికి వెళ్లిన అతడికి ఆ తర్వాత ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ప్రయత్నాలు చేసీ చేసీ విసిగిపోయి చివరికి ఓ ఆటోను కొనుక్కున్నాడు. ఎవరి దగ్గరో పనిచేయడం కంటే ఇలా కష్టపడితే ఆత్మగౌరవంతో డబ్బు రెండూ ఉంటాయని, తనను అందరూ దీవించాలని కోరుతూ లింకిడ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టగా అది వైరల్ అవుతోంది.

Similar News

News January 23, 2025

ట్రంప్ తగ్గేదే లే

image

అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.

News January 23, 2025

ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News January 23, 2025

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.