News May 7, 2025
న్యాయమూర్తిని అరెస్టు చేసిన FBI!

అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏకంగా ఓ న్యాయమూర్తినే తాజాగా అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుడికి మిల్‌వాకీలోని సీనియర్ సిటింగ్ జడ్జి హన్నా దుగన్ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా కోర్టులోనే అధికారుల్ని ఆమె తప్పుదోవ పట్టించి వలసదారుడు తప్పించుకునేందుకు సహకరించడంతో FBI ఆమెను, వలసదారుడిని అరెస్ట్ చేసింది.
Similar News
News March 15, 2026
వారిద్దరినీ వదులుకొని KKR తప్పు చేసింది: కుంబ్లే

KKR 2024లో మూడోసారి IPL ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లది కీలక పాత్ర అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పారు. అలాంటి వాళ్లను వదులుకోవడం కోల్‌కతా చేసిన మిస్టేక్ అని అభిప్రాయపడ్డారు. కీలక ప్లేయర్లను తమ వద్దే ఉంచుకోవడం ఎంత ముఖ్యమన్నది జట్టు అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే టైటిల్ పోటీలో నిలవలేదని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం శ్రేయస్ PBKS, సాల్ట్ RCBలో చేరిన విషయం తెలిసిందే.
News March 15, 2026
నావిక్‌కు అంతరాయం

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.
News March 15, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.


