News January 25, 2025
సోనూసూద్ ఫౌండేషన్‌కు FCRA లైసెన్స్ మంజూరు

సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్సు పొందిన NGOలు ఐదేళ్ల పాటు విదేశీ నిధులను స్వీకరించవచ్చు, వాడుకోవచ్చు. సామాజిక సేవ చేయడం, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందాలనేదే తమ లక్ష్యమని సూద్ ఫౌండేషన్ పేర్కొంది. కొవిడ్ టైంలో సోనూసూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 16, 2025
₹9L Crకు వస్త్ర ఎగుమతులు.. అదే మా టార్గెట్: మోదీ

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతిదారుగా భారత్ ఉందని PM మోదీ చెప్పారు. ప్రస్తుతం ₹3L Cr కోట్లుగా ఉన్న వార్షిక ఎగుమతులను 2030కి ₹9L Crకు పెంచడమే తమ లక్ష్యమన్నారు. వస్త్ర రంగానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ టెక్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైగ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీలోనూ ఇండియా దూసుకెళ్తోందన్నారు. కాగా ఈ సదస్సులో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.
News February 16, 2025
‘సచివాలయ’ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై రేపు కీలక భేటీ

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.
News February 16, 2025
ప్రముఖ నటి కన్నుమూత

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్‌లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.