News February 1, 2025

బీమా రంగంలో FDI 100 శాతానికి పెంపు

image

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిధిని ప్రస్తుతమున్న 74శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. FDI విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సమీక్షించి మరింత సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, మొత్తం ప్రీమియాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్ చేసే బీమాదారులకు ఇది వర్తించనుంది. దీని ద్వారా బీమా రంగం మరింత బలోపేతమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు వివరిస్తున్నారు.

Similar News

News January 19, 2026

త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CBN

image

ఏపీలో ఈ ఏడాది డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్సులు తీసుకొస్తున్నట్లు CM CBN తెలిపారు. విశాఖకు రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని జూరిచ్ తెలుగు డయాస్పోరా మీటింగ్‌లో పేర్కొన్నారు. ‘NRI‌లను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రూ.50కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తాం. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో ముందుకెళ్తున్నాం’ అని చెప్పారు. బెస్ట్ వర్సిటీల్లో చదవాలనుకునే వారికి 4% వడ్డీతో రుణాలిస్తామన్నారు.

News January 19, 2026

గుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏమన్నారంటే?

image

కొలెస్ట్రాల్ భయంతో గుడ్లు తినడం మానేశారా? అయితే ఈ విషయం మీ కోసమే. గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని పైగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం స్వల్పమేనని, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ తినాలని సూచిస్తున్నారు.

News January 19, 2026

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

image

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి వల్ల చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. ఆహారంలో తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమంగా వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.