News August 11, 2025

వీడిన భయాలు.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

ట్రంప్ టారిఫ్స్ భయాల నుంచి కోలుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 746 పాయింట్లు లాభపడి మళ్లీ 80,604, నిఫ్టీ 221 పాయింట్లు వృద్ధి చెంది 24,585 వద్ద క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్, ఎటర్నల్, ట్రెంట్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, అదానీ పోర్ట్స్, రిలయన్స్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. బెల్, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Similar News

News August 11, 2025

ఇందులో నా తప్పులేదు: నిధి అగర్వాల్

image

AP: తాను ప్రభుత్వ వాహనంలో తిరగడంపై నెలకొన్న వివాదంపై హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించారు. ‘భీమవరంలో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇది జరిగింది. స్థానిక నిర్వాహకులు నాకోసం కారును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు. ఇందులో నా ప్రమేయం లేదు. ప్రభుత్వమే నాకు ఈ వాహన సదుపాయం కల్పించిందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. అభిమానులు నమ్మవద్దు’ అని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

News August 11, 2025

HCAలో రూల్స్‌కు విరుద్ధంగా నియామకాలు: ఫహీమ్

image

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కాంగ్రెస్ నేత MA ఫహీమ్ ఆరోపించారు. ఈ విషయంపై CID, విజిలెన్స్&ఎన్‌పోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘అర్హత లేకపోయినా కొందరిని సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఎన్పీ సింగ్, ఆకాశ్ బండారికి తప్ప ఛైర్‌పర్సన్‌తో సహా మరెవరికీ సరైన అర్హతలు లేవు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.

News August 11, 2025

జిల్లాల పేర్లు, హద్దుల మార్పుపై 13న జీవోఎం భేటీ: అనగాని

image

AP: జిల్లా, మండలాల పేర్లు, సరిహద్దుల మార్పుపై ఈనెల 13న GOM భేటీ కానుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘గత ప్రభుత్వం జిల్లాల పున:వ్యవస్థీకరణను అడ్డదిడ్డంగా చేసింది. వాటి సరిహద్దులు, పేర్లు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా అర్జీలుంటే ఇవ్వొచ్చు. వీటిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వెల్లడించారు. GOMలో నారాయణ, అనిత, జనార్దన్‌, నిమ్మల, మనోహర్, సత్యకుమార్ ఉన్నారు.