News March 16, 2025

ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

image

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్‌లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.

Similar News

News April 20, 2025

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.

News April 20, 2025

బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

image

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.

News April 20, 2025

మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

image

స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్‌లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్‌స్టోన్ RCBకి ఆడుతున్నారు.

error: Content is protected !!