News May 26, 2024
FEEL FOR HARDIK: అన్నీ తనకే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకు ఏదీ కలిసి రావడం లేదు. ఆ మధ్య అతడిని ముంబై కెప్టెన్‌గా ప్రకటించడంతో సొంత రాష్ట్రం, దేశ ప్రజలతోనే ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత IPLలో ముంబై ఘోర ప్రదర్శనతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు భార్య విడాకులు ఇచ్చేశారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాయాలతో నిరంతర పోరాటం చేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య కూడా ఆయన టీ20 WC ఆడేందుకు సిద్ధమయ్యారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.