News May 26, 2024

FEEL FOR HARDIK: అన్నీ తనకే?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకు ఏదీ కలిసి రావడం లేదు. ఆ మధ్య అతడిని ముంబై కెప్టెన్‌గా ప్రకటించడంతో సొంత రాష్ట్రం, దేశ ప్రజలతోనే ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత IPLలో ముంబై ఘోర ప్రదర్శనతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు భార్య విడాకులు ఇచ్చేశారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాయాలతో నిరంతర పోరాటం చేస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య కూడా ఆయన టీ20 WC ఆడేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News February 13, 2025

మంచి మాట – పద్యబాట

image

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ

భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.

News February 13, 2025

కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

image

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.

News February 13, 2025

కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి

image

TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!