News August 31, 2024
ప్రైవేట్ కాలేజీల్లో బీఈడీ కోర్సుకు ఫీజు ఖరారు
AP: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో బీఈడీ కోర్సులకు ఫీజును రూ.9వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సులతో ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-26 వరకు ఈ ఫీజులే అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు రెండో విడత కౌన్సెలింగ్‌తో కలిపి డిగ్రీలో 49.24శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
Similar News
News September 19, 2024
అట్లీతో తప్పకుండా సినిమా చేస్తా: NTR
‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీతో తీసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘అట్లీ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారు. రొమాంటిక్ కామెడీ స్టోరీని కూడా డిస్కస్ చేశాం. తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ, తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా తీస్తాం. ఆయన తీసిన రాజా-రాణి అంటే నాకెంతో ఇష్టం’ అని ఎన్టీఆర్ తెలిపారు.
News September 19, 2024
వ్యర్థాల తొలగింపుపై హైడ్రా కీలక నిర్ణయం
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆఫ్‌లైన్‌లో బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
News September 19, 2024
జానీ మాస్టర్ అరెస్ట్.. నాగబాబు ట్వీట్లు వైరల్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్లు చేశారు. చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్థునిగా పరిగణించొద్దనే కోట్‌ను పోస్ట్ చేశారు. మీరు వినేదే నమ్మొద్దని, ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని మరో పోస్టులో పేర్కొన్నారు. దీంతో జానీకి మద్దతుగా చేస్తున్నారని నెట్టింట చర్చ జరుగుతోంది. అత్యాచార కేసు నమోదవ్వడంతో జానీపై జనసేన పార్టీ వేటు వేసింది.