News February 4, 2025

గుండుతోనే పెళ్లి చేసుకున్న మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్

image

ఆడవారు అందంగా కనిపించేందుకు తమ జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రత్యేక అలంకరణలో కనిపించేందుకు ఇష్టపడుతారు. అయితే డిజిటల్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా గుండుతోనే పెళ్లి చేసుకున్నారు. చిన్నతనం నుంచే అలోపీసీయా వ్యాధితో బాధపడుతున్న ఆమె ఎలాంటి విగ్గులేకుండా పెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి కాస్త వైరల్ అవ్వడంతో బ్యూటీ అనేది ఎలా ఉన్నా ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News January 22, 2026

రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు దొరికిందా?

image

రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకడం యాదృచ్చికం కాదని, భగవంతుడి సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ‘నాణెం దొరికితే కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. నోటు దొరకడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచిక. ఇలా దొరికిన సొమ్మును ఖర్చు, దానం చేయకూడదు. దైవ ప్రసాదంగా భావించి, పర్సు/పూజా గదిలో భద్రపరచాలి. తద్వారా మనిషికి/ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం వేళ డబ్బు దొరకడం రెండింతలు అదృష్టం’ అంటున్నారు.

News January 22, 2026

SECLలో 66 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (<>SECL<<>>) 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 7వ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మెంటల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ & రీజనింగ్ స్కిల్స్, జనరల్ అవేర్‌నెస్, సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి. వెబ్‌సైట్ :https://secl-cil.in/

News January 22, 2026

గిల్ డకౌట్.. సర్ఫరాజ్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీలో ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ నిరాశపరిచారు. సౌరాష్ట్రతో మ్యాచులో ఈ పంజాబ్ బ్యాటర్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యారు. మరోవైపు డొమెస్టిక్ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ హైదరాబాద్‌పై సెంచరీ బాదారు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.