News February 4, 2025

గుండుతోనే పెళ్లి చేసుకున్న మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్

image

ఆడవారు అందంగా కనిపించేందుకు తమ జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రత్యేక అలంకరణలో కనిపించేందుకు ఇష్టపడుతారు. అయితే డిజిటల్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా గుండుతోనే పెళ్లి చేసుకున్నారు. చిన్నతనం నుంచే అలోపీసీయా వ్యాధితో బాధపడుతున్న ఆమె ఎలాంటి విగ్గులేకుండా పెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి కాస్త వైరల్ అవ్వడంతో బ్యూటీ అనేది ఎలా ఉన్నా ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News February 19, 2025

సీబీఎస్ఈ కీలక నిర్ణయం

image

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.

News February 19, 2025

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

image

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

News February 19, 2025

దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

image

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

error: Content is protected !!