News November 30, 2024
ఫెంగల్ ఎఫెక్ట్.. విమానాలు రద్దు
తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో చెన్నైలో కుండపోత వానలు, బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో HYD నుంచి చెన్నై వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి HYD రావాల్సిన 3 ఫ్లైట్స్ రద్దయ్యాయి. అలాగే HYD నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, తిరుపతి నుంచి HYD రావాల్సిన 7 విమానాలను అధికారులు రద్దు చేశారు. ముంబై, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన 2 ఫ్లైట్స్‌ను దారి మళ్లించారు.
Similar News
News December 4, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం
TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా ఏటూరు నాగారం, పెద్దపల్లికి బస్ డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
News December 4, 2024
రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి
TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.
News December 4, 2024
డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన శిండే
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.