News September 27, 2024
Festive Season: 6000 స్పెషల్ ట్రైన్స్, 12500 కోచులు
ఇండియన్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగల సీజన్లో 6వేల స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తామని తెలిపింది. ఇవి కోటి మందికి పైగా ప్యాసింజర్లను ఇళ్లకు చేరుస్తాయని వెల్లడించింది. దసరా, దీపావళి, ఛాత్‌ను జరుపుకొనేందుకు ప్రజలు సొంత రాష్ట్రాలకు వెళ్లే సంగతి తెలిసిందే. ఇవే కాకుండా 108 రైళ్లకు అదనపు జనరల్ కోచులు జత చేస్తామని, రద్దీకి తగినట్టుగా 12,500 కోచ్‌ల్ని మంజూరు చేశామని రైల్వే మినిస్టర్ వైష్ణవ్ తెలిపారు.
Similar News
News October 11, 2024
ట్రంప్ ఎన్నికల ప్రకటనల్లో తెలుగు కూడా!
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.
News October 11, 2024
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TG: ఆరోగ్యశాఖలో మరో 371 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గత నెలలో 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ పోస్టులకు అక్టోబర్ 14, ఫార్మాసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. <
News October 11, 2024
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
TG: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉపవర్గాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.