News May 12, 2024
యువరాజు వయసు కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు: మోదీ

చరిత్రలో ఎన్నడూ చూడనన్ని తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. యువరాజు(రాహుల్ గాంధీ) వయసు కంటే తక్కువ సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. TMC ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సందేశ్‌ఖాళీ వ్యవహారంలో నిందితులను కాపాడటానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
Similar News
News April 11, 2026
ఎల్లుండి టెట్ నోటిఫికేషన్?

TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. ఇప్పుడు రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది.
News April 11, 2026
WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News April 11, 2026
‘దీపం’ లబ్ధిదారులు PNGకి మారినా రాయితీ ఇస్తాం: CM CBN

AP: దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)కి మారినా వారికి ఇచ్చే రాయితీని ఖాతాల్లో జమ చేస్తామని CM CBN వెల్లడించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్షించిన ఆయన, రాబోయే 6 నెలల్లో 10 లక్షల PNG కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్‌ను నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఫోన్‌లో కోరారు.


