News October 19, 2024

గాజాపై భీకర దాడి.. 33 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 33 మంది మరణించారు. వీరిలో 21 మంది మహిళలే ఉన్నారు. మరో 80 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,500 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్ష మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

Similar News

News October 19, 2024

LeT టెర్రరిస్టులతో జకీర్ నాయక్ భేటీ

image

భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడ లష్కర్ ఏ తోయిబా(LeT) ఉగ్రవాదులు ఇక్బాల్ హష్మీ, మహ్మద్ ధర్, నదీమ్‌లను కలుసుకున్నాడు. భారీ బందోబస్తు మధ్య లాహోర్‌లో నిర్వహించిన సభలో 1,50,000 మందిని ఉద్దేశించి ప్రసంగించాడు. 2016 మనీలాండరింగ్ కేసు తర్వాత అతను మలేషియాకు మకాం మార్చిన విషయం తెలిసిందే. అతని ‘పీస్ టీవీ’పై భారత్, బంగ్లా, శ్రీలంకలో నిషేధం ఉంది.

News October 19, 2024

మహారాష్ట్ర ఎన్నికలు: FB, X, INSTAకు నోటీసులు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లను తికమకపెట్టేలా ఉన్న 1752 ఫేక్‌న్యూస్ పోస్టులను తొలగించాలని ఆదేశించామంది. ఇప్పటి వరకు FB 16, INSTA 28, X 251, YT 5 పోస్టులను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. కోడ్ ఉల్లంఘనపై c-VIGIL యాప్ ద్వారా 420 ఫిర్యాదులు రాగా 414 పరిష్కరించామని తెలిపింది. రూ.10.64కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, లిక్కర్ సీజ్ చేశామంది.

News October 19, 2024

ఛాన్స్ దొరికింది.. కుమ్మేశాడు

image

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నులకొద్దీ(4422) రన్స్. పదుల సంఖ్యలో సెంచరీలు(15), హాఫ్ సెంచరీలు(14). అయినా భారత జట్టులో చోటు కోసం పోరాటమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా వినియోగించుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కష్టాల్లో పడ్డ భారత్‌కు అండగా నిలిచారు. టెస్టుల్లో తన సెంచరీల ఖాతా ఓపెన్ చేశారు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారు.