News March 23, 2025
సీట్లే కాదు పార్లమెంటులో ప్రాధాన్యత కోసం పోరాటం: కేకే

TG: పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ప్రభుత్వ సలహాదారు K కేశవరావు ఆకాంక్షించారు. ఎంపీ సీట్ల గురించే కాకుండా పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే పునర్విభజన చేయాలన్నారు.
Similar News
News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 25, 2025
మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.
News March 25, 2025
హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

TG: హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.