News April 4, 2024

OTTలో అదరగొడుతోన్న ‘ఫైటర్’

image

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో హృతిక్ రోహన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఫైటర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 10 రోజుల్లోనే 12.5M వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న బాలీవుడ్ సినిమాగా నిలిచినట్లు తెలిపారు. యానిమల్, డంకీ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Similar News

News February 15, 2026

జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు INDలో ఆశ్రయం కల్పిస్తామని PM మోదీ ప్రకటించారు. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7GW దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. కాగా రేపు ఢిల్లీలో <<19143850>>ఏఐ సమ్మిట్‌ను<<>> PM ప్రారంభించనున్నారు.

News February 15, 2026

ప్రభాస్‌కు గాయం!

image

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్‌లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.

News February 15, 2026

శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

image

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.