News August 5, 2024

ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్పలో ఫైళ్లు!

image

AP: ఇటీవల గుంటూరు ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో చెత్తకుప్పలో ఫైళ్లు కనిపించిన కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్ప వద్ద ఫైళ్లను పెట్టి, వీడియో తీసి వైరల్ చేసినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఫైళ్ల దహన ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కావాలనే ఇలా చేసినట్లు తేల్చారు. విజయవాడలోని యనమలకుదురు, మదనపల్లిలో ఫైళ్ల దహనం ఘటనలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

Similar News

News January 2, 2026

మాటపై ఉంటారా? టికెట్ రేట్స్ పెంచుతారా?

image

TG: పుష్ప 2 విషాదం తర్వాత సినిమాల టికెట్ రేట్స్ పెంచమని CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పలు మూవీస్ రేట్ పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇటీవల అఖండ-2కు ధరలు పెంచగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తనకు తెలియకుండా అధికారులే ఆదేశాలిచ్చారని, ఇకపై ఇలా జరగదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలోని ‘రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు’లకూ ఇది వర్తిస్తుందా? చూడాలి.

News January 2, 2026

పార్టీయే ప్రాణం.. భర్తకు గుడ్‌బై!

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. BJP పట్ల విధేయత కారణంగా మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వివాదానికి దారి తీసింది. దీనిని పార్టీకి వెన్నుపోటుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

News January 2, 2026

వంటింటి చిట్కాలు

image

☛ ఆకుకూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఒకవేళ సూర్యకాంతి వాటిపై ఎక్కువగా పడితే వాటిలో ఉండే పోషక పదార్థాలు క్రమంగా నశిస్తాయి.
☛ ఆకుకూరలను పెద్దగా తరిగి వండటం వల్ల, అందులో ఉండే పోషక విలువలు తగ్గకుండా మన శరీరానికి అందుతాయి.
☛ క్యారెట్, ముల్లంగి వంటి వాటిని దుంపలతో పాటు వాటికి ఉండే ఆకులను కూడా వండుకొని తినాలి. ఇలా చేస్తే వాటిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి.