News August 5, 2024
ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్పలో ఫైళ్లు!
AP: ఇటీవల గుంటూరు ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో చెత్తకుప్పలో ఫైళ్లు కనిపించిన కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్ప వద్ద ఫైళ్లను పెట్టి, వీడియో తీసి వైరల్ చేసినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఫైళ్ల దహన ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కావాలనే ఇలా చేసినట్లు తేల్చారు. విజయవాడలోని యనమలకుదురు, మదనపల్లిలో ఫైళ్ల దహనం ఘటనలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.
Similar News
News September 13, 2024
ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం: జగన్
AP: విజయవాడలో బుడమేరు మాదిరిగానే ఏలేరు రిజర్వాయర్ వరద ఉద్ధృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లిప్తత కనిపించిందన్నారు. కనీసం కలెక్టర్లతో రివ్యూ చేయలేదని దుయ్యబట్టారు.
News September 13, 2024
టీడీపీ ఖాతాలోకి జగ్గయ్యపేట మున్సిపాలిటీ
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేశ్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. వైసీపీ సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చక వారంతా టీడీపీలో చేరారని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు.
News September 13, 2024
కేసీఆర్ అంటే నాకెప్పటికీ గౌరవమే: ఎమ్మెల్యే అరెకపూడి
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రౌడీలా మాట్లాడటం వల్లే తాను నోరు జారానని కాంగ్రెస్ MLA అరెకపూడి గాంధీ అన్నారు. ‘మహిళల్ని అవమానించేలా కౌశిక్ మాట్లాడారు. ప్రాంతీయ విభేదాలు తెచ్చారు. KCR అంటే నాకెప్పటికీ గౌరవమే. ఆయన మమ్మల్ని ఆదరించారు. కౌశిక్ వంటి చీడపురుగులు ఉంటే KCR గొప్ప మనస్తత్వానికి, గతంలో మేం చేసిన సేవలకు, పార్టీకి మచ్చ వస్తుంది. అలాంటి వాళ్ల వల్లే అధికారం కోల్పోయాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.