News April 5, 2024

BJPలోకి సినీ నటి, MP సుమలత

image

నటి, మండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఆమె 2019 జనరల్ ఎలక్షన్స్‌లో HD కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించి ఎంపీ అయ్యారు. అప్పుడు ఆమెకు బీజేపీ మద్దతు తెలిపింది. కాగా బీజేపీ పెద్దల సమక్షంలో ఆమె ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Similar News

News January 20, 2025

జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

image

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్‌ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్‌గా రూ.299 ప్లాన్‌కు బదిలీ అవుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

News January 20, 2025

రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ: సీఎం చంద్రబాబు

image

దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఫొటోను తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ లాంజ్‌లో అనూహ్యంగా సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించాం’ అని రేవంత్ రాసుకొచ్చారు. దీనికి సీఎం CBN స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి. TG సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు.

News January 20, 2025

కాసేపట్లో ప్రమాణం.. చర్చిలో ట్రంప్ ప్రార్థనలు

image

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మెలానియా దంపతులు సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్-ఉష దంపతులు కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం రా.10.30 గంటలకు ట్రంప్, వాన్స్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.