News July 11, 2024
FILMFARE AWARDS: ‘బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం’

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం చిత్రం నిలిచింది. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ యాక్టర్లుగా ఎంపికయ్యారు. సపోర్టింగ్ రోల్ బెస్ట్ యాక్టర్‌గా రానా(బీమ్లా నాయక్), ఉత్తమ నటి క్రిటిక్స్ సాయిపల్లవి(విరాటపర్వం), బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్(నాటు నాటు), ఉత్తమ రచయితగా సిరివెన్నెల(కానున్న కళ్యాణం, సీతారామం)కి అవార్డులు వరించాయి.
Similar News
News February 9, 2025
ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!

* అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. మెసేజ్‌లకు లేట్‌గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.
News February 9, 2025
బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.