News July 27, 2024
అబార్షన్‌పై తుది నిర్ణయం బాధిత మహిళలదే: అలహాబాద్ హైకోర్టు
అత్యాచార బాధితులకు అబార్షన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రెగ్నెన్సీ కొనసాగించడం లేక అబార్షన్ చేయించుకోవడం అనే దానిపై బాధిత మహిళలే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అబార్షన్‌కు అనుమతించాలని ఓ మైనర్ కోర్టును ఆశ్రయించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చి దత్తతు ఇవ్వాలని భావిస్తే ఆ ప్రక్రియను పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది.
Similar News
News December 1, 2024
BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్
దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
News December 1, 2024
రేపు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.
News December 1, 2024
SRH స్ఫూర్తి.. 20ఓవర్లలో 266 రన్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర బ్యాటింగ్‌లో ఊచకోత కోసింది. SRH క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర 20 ఓవర్లలో 266 రన్స్ కొట్టింది. అందులో 21 సిక్సర్లు, 20 ఫోర్లుండటం గమనార్హం. ఛేదనలో బరోడా టీమ్ 20 ఓవర్లలో 188/8కి పరిమితం అయ్యింది. దీంతో 78 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ విషయాన్ని ఉనద్కత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘సన్ రైజర్స్ సౌరాష్ట్ర’ అంటూ రాసుకొచ్చారు.