News March 9, 2025
ఫైనల్.. దూకుడుగా న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీ-2025: ఫైనల్లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 6.2 ఓవర్లలో 46 రన్స్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 28* దూకుడుగా ఆడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించారు. వికెట్లు పడాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News March 27, 2025
నటి రన్యా రావుకు షాక్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో రన్యా రావుకు సహకరించిన సాహిల్ జైన్‌ను తాజాగా డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
News March 27, 2025
రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.
News March 27, 2025
‘రామ జన్మభూమి’ ఎడిషన్ వాచ్‌తో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్‌లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.