News June 5, 2024
FINAL రిజల్ట్స్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయంటే?
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో పార్టీల వారీగా అత్యధికంగా బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99, SPకి 37, టీఎంసీకి 29, డీఎంకేకు 22, టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లు వచ్చాయని ఈసీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక ఓవరాల్‌గా ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 232, ఇతరులకు 18 సీట్లు వచ్చాయి. కాగా 2019లో కాంగ్రెస్‌కు 52 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 14, 2024
రికార్డు నెలకొల్పిన అర్ష్‌దీప్ సింగ్
భారత పేస్ సెన్సేషన్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన 3వ టీ20లో సింగ్ 3 వికెట్లు తీశారు. దీంతో టీ20 కెరీర్‌లో మొత్తం 92 వికెట్లు సొంతం చేసుకొని టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్(90), బుమ్రా(89) ఉన్నారు. మొత్తంగా చూస్తే స్పిన్నర్ చాహల్(96) టాప్‌లో ఉన్నారు.
News November 14, 2024
నవంబర్ 14: చరిత్రలో ఈ రోజు
* 1949: బాలల దినోత్సవం
* 1889: భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జననం.(ఫొటోలో)
* 1948: రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
* 1967: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు మరణం.
* 2020: తెలంగాణ నీటిపారుదల దినోత్సవం.
* ప్రపంచ మధుమేహ దినోత్సవం.
News November 14, 2024
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు: పవన్
AP: విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా అందిస్తున్న ఆహారం నాణ్యతలో రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.1,854 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొన్ని పాఠశాలల్లో నాణ్యతా లేదనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో ఆయన ఇలా స్పందించారు. అధికారులు తనిఖీలు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.