News May 26, 2024

FINAL: KKRపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!

image

ఇవాళ చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ SRH ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో 4 రన్స్ తేడాతో, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో నేడు జరిగే ఫైనల్‌లో కేకేఆర్‌ను SRH చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALL THE BEST SRH

Similar News

News January 18, 2025

పూర్తిగా కోలుకున్న విశాల్

image

ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్‌లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.

News January 18, 2025

ఎంపీతో రింకూ ఎంగేజ్‌మెంట్‌లో ట్విస్ట్!

image

రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్‌ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్‌మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.

News January 17, 2025

మహాకుంభమేళాలో శ్రీవారికి గంగా హారతి

image

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో తిరుమల శ్రీవారికి గంగా హారతిని అర్చకులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోఛ్చారణల నడుమ శ్రీనివాసుడి ప్రతిమను ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.