News May 26, 2024
FINAL: KKRపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!

ఇవాళ చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ SRH ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో 4 రన్స్ తేడాతో, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో నేడు జరిగే ఫైనల్‌లో కేకేఆర్‌ను SRH చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALL THE BEST SRH
Similar News
News February 13, 2025
ప్రియుడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేశ్

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసినట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలనలో మణిపుర్ రికార్డు

అత్యధికసార్లు(11) రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపుర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో UP(10), J&K(9) బిహార్(8), పంజాబ్(8) ఉన్నాయి. రోజుల(4,668) పరంగా J&K టాప్‌లో ఉంది. ఆ తర్వాత పంజాబ్(3,878), పాండిచ్చేరి(2,739) ఉన్నాయి. 1951లో తొలిసారిగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటికి 29 రాష్ట్రాలు/UTలలో 134సార్లు విధించారు. TG, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కసారీ ప్రెసిడెంట్ రూల్ రాలేదు.
News February 13, 2025
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి: చంద్రబాబు

AP: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తేవాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని సూచించారు.