News September 24, 2024

రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ

image

AP: వరదలతో నష్టపోయిన బాధితుల అకౌంట్లలోకి రేపు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. విజయవాడలో 179 సచివాయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌కు రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. ధ్వంసమైన దుకాణాలకు రూ.25వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందిస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.

Similar News

News October 7, 2024

టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఈవో

image

AP: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)పై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో శ్యామలరావు హెచ్చరించారు. టీటీడీని తక్కువ చేసేలా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంటూ ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.

News October 7, 2024

మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేల దందా.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి?

image

AP: మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దరఖాస్తులు వేయొద్దని, తమకు వాటాలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 3,396 దుకాణాలకు లక్ష దరఖాస్తులు, రుసుముల రూపంలో రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటికి 8,274 మాత్రమే వచ్చాయి. 961 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు 3 రోజుల్లో ముగియనుంది.

News October 7, 2024

HYDRA కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!

image

TG: నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్‌లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం ₹650కోట్లకే పరిమితమైంది. HYD, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుంది.