News December 8, 2024

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది: కిషన్ రెడ్డి

image

TG: KCR, రేవంత్ కవల పిల్లలని, ఆ పార్టీల DNA ఒకటే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని తెలిపారు. పదేళ్లలో KCR, ఏడాది గడిచినా రేవంత్ ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదన్నారు. హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 8 సీట్లు, BJPకి 8 సీట్లు వచ్చాయని, రాష్ట్రంలో BJP బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని సరూర్‌నగర్ సభలో చెప్పారు.

Similar News

News December 9, 2025

హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(NI-<>MSME<<>>)లో 3 అసోసియేట్ ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.nimsme.gov.in

News December 9, 2025

శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

image

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.

News December 9, 2025

మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

image

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.