News February 20, 2025

జగన్ వల్లే ఆర్థిక ఇబ్బందులు: పవన్

image

AP: రాష్ట్రంలో సమన్వయంతో కలిసి నడుస్తున్నామని Dy.CM పవన్ అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ ఆ నొప్పి వేధిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అందువల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు.

Similar News

News March 22, 2025

టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

image

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.

News March 22, 2025

IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

image

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

News March 22, 2025

నేడు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

image

తమిళనాడులో అధికార డీఎంకే అధ్యక్షతన డీలిమిటేషన్‌పై నేడు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెన్నై చేరుకున్నారు. వారికి అక్కడి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం నేతలందరూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

error: Content is protected !!