News December 10, 2024

ఎవరైనా చనిపోతే వేళ్లు నరికేసుకునేవారు!

image

పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా ప్రజలు గతంలో ఓ విచిత్రమైన ఆచారాన్ని పాటించారు. అక్కడి కొన్ని జాతుల వారు కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను నరికేసుకునేవారు. ఇది తీవ్ర దుఃఖాన్ని, నష్టాన్ని వ్యక్తీకరిస్తుందని వారి భావన. సంప్రదాయ పరికరాలతోనే వేలి పైభాగాన్ని కట్ చేసి, సహజ పద్ధతులతో గాయాలకు చికిత్స చేసేవారు. కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.

Similar News

News January 17, 2025

రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS

image

దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.

News January 17, 2025

3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ

image

AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News January 17, 2025

సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.