News August 6, 2024

కేటీఆర్‌పై FIR నమోదు

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 26న అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్‌పై BRS శ్రేణులు డ్రోన్ ఎగరేసిన ఘటనపై ఇరిగేషన్ అధికారి షేక్ వలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

Similar News

News January 16, 2025

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

News January 16, 2025

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. హామీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ విడుదల చేశారు.
1. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
** తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

News January 16, 2025

నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

image

AP: తనపై, తన భార్యపై దాడి జరిగిందని తిరుపతి(D) చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.