News January 1, 2025
తొలి క్యాబినెట్ భేటీ రైతుల శ్రేయస్సుకు అంకితం: ప్రధాని మోదీ
రైతులకు మేలు చేస్తూ కేంద్ర క్యాబినెట్ <<15038464>>తీసుకున్న నిర్ణయాలపై<<>> ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉంది. మన దేశానికి ఆహారం అందించడానికి కష్టపడి పనిచేసే రైతు సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నాం. 2025లో మొదటి క్యాబినెట్ సమావేశాన్ని అన్నదాతల శ్రేయస్సు కోసం అంకితం చేశాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 22, 2025
27మంది మావోలు మృతి.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చలపతి(60) ఉన్నారు. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా మాటెంపల్లి కాగా, రూ.కోటి రివార్డ్ ఉంది. చలపతి వద్ద ఎప్పుడూ ఏకే 47, ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని, చుట్టూ 8- 10 మంది మావోలు సెక్యూరిటీ ఉంటారని సమాచారం.
News January 22, 2025
ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లు మళ్లీ రానున్నాయా?
ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్‌ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.
News January 22, 2025
USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్
దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.